జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు..

Spread the love

ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీ సీతారామాంజనేయులు, ఐపీఎస్ మరో ఇద్దరు అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. జత్వానీ కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలకు దిగింది. జత్వానీపై కేసు నమోదు చేసి హడావుడిగా అరెస్టు చేసిన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్‌లు కర్త, కర్మ, క్రియలు వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

 

ఈ కేసులో ఇప్పటికే విజయవాడలో ఏసీపీగా పని చేసిన హనుమంతరావ్, నాటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలపై ఇది వరకే సస్పెన్షన్ వేటు పడింది. వీరిద్దరూ కుక్కల సాగర్ ఫిర్యాదు తర్వాత కాదంబరి జత్వానీని వీరు ఇంటరాగేషన్ చేశారని తెలుస్తున్నది. హనుమంత రావు ఈ ఇంటరాగేషన్‌లో కీలక పాత్ర పోషించగా.. సత్యనారాయణ.. ప్రభుత్వంలో%