పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Spread the love

కమెడియన్ ఆలీ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా మారుతున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కనిపించి విమర్శలు అందుకున్న ఆలీ.. సండే గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఉత్సవం సినిమాలో ఆలీ ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

 

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో తాజాగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఈ ఈవెంట్ లో ఆలీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నారదుడు అనే పాత్రలో కనిపించాను అని, అది తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపాడు.

 

ఇక స్పీచ్ అనంతరం.. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఆలీ సమాధానమిచ్చాడు. ఇందులో భాగంగానే ఆలీకి, పవన్ కళ్యాణ్ గురించిన ప్రశ్న ఎదురైంది. పవన్ – ఆలీ స్నేహ బంధం గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఒకానొక సమయంలో ఆలీ లేని పవన్ సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు.. రాజకీయాల వలన విడిపోయారు. పవన్ జనసేన పార్టీ స్థాపించిన్నప్పుడు .. ఒక ఫ్రెండ్ గా ఆలీ, పవన్ కు అండగా నిలబడలేదు. తనకు ఇష్టమైన వైసీపీలోనే కొనసాగాడు.

 

ఇక ఇద్దరు ఒకపక్క ఫ్రెండ్స్ గా ఉంటూ.. రాజకీయాల్లో ఉండలేమని పవన్ భావించి, ఆలీని దూరం పెట్టిన్నట్లు సమాచారం. అలా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోయారు. కానీ, ఏరోజు కూడా ఆలీ.. రాజకీయ స్పీచ్ లలో కానీ, మీడియా ముందు కానీ, పవన్ ను తక్కువ చేసి మాట్లాడలేదు.. విమర్శించలేదు.

 

ఇక ఈ ఈవెంట్ లో కూడా ఒక రిపోర్టర్ .. పవన్ తో మీ అనుబంధం ఎలా ఉంది అని అడగ్గా.. ” మా ఇద్దరి మధ్య అనుబంధం.. మూడు పువ్వులు ఆరుకాయలులానే ఉంది. పవన్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మధ్యనే ఆలీ.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే. మరి ఇప్పుడు ఆలీని, పవన్ దగ్గరకు రానిస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *