భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్దితో ఒక భారీ పరివర్తన దిశగా పురోగమిస్తుంది. “అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” (ఏబీఎస్ఎస్) కింద ఆధునిక ప్రయాణీకులకు సౌకర్యాలను అందించడానికి, ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 38 రైల్వే స్టేషన్‌లు, 430 కోట్ల వ్యయంతో శాటిలైట్ టెర్మినల్ గా అభివృద్ధి చెందుతున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌తో సహ రైల్వే స్టేషన్‌లు తిరిగి అభివృద్ధి చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 2023, ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకానికి మరింత ప్రోత్సాహం లభించింది. వాటితో పాటుగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనుల్లో ప్రధానమైన పునరాభివృద్దితో పాటు, ప్రస్తుతం ఉన్న ఇతర రైలు టెర్మినల్స్‌లో కూడా రద్దీని తగ్గించడానికి చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధిని చేపట్టబడింది.
రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని ఊహించడం లక్ష్యంగా పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించింది. ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, రైల్వే స్టేషన్‌ల ప్రోత్సాహాన్ని పెంచే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేసిన సౌకర్యాలు :
ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు.
• స్టేషనుకు దారి తీసే రోడ్లను వెడల్పు చేయడం ద్వారా రాకపోకలను సులభతరం చేయడం
• సరైన రీతిలో రూపొందించబడిన సైనేజీలు, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, సరైన పార్కింగ్ ప్రదేశం, మెరుగుపరచబడిన లైటింగ్ మొదలైనవి.
• స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్ స్కేపింగ్
• రైలు వినియోగదారులకు ఆహ్లాదకర అనుభూతిని చేకూర్చేందుకు స్థానిక కళలు, సంస్కృతికి ప్రాధాన్యతనివ్వడం.
• ”వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్” పథకం కింద స్టాళ్లను ఏర్పాటు చేయడం.
• సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా స్టేషన్ భవనం, ప్రాంగణానికి రెండవ ప్రవేశాన్ని ఏర్పాటు చేయడం
• ఎక్కువ ఎత్తున్న ప్లాట్ఫారంల నిర్మాణం, సరిపడే విధమైన షెల్టర్ల నిర్మాణం.
• మరింత నాణ్యత గల పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎల్ఈడి స్టేషన్ నేమ్ బోర్డులు, వెయిటింగ్ హాళ్లకు అభివృద్ధి పనులు, వినియోగదారుల కోసం సైనేజీలు మొదలైనవి ఏర్పాటు
• స్టేషన్లను ‘సిటీ కేంద్రాలు ‘గా అభివృద్ధి చేయడం.
• నగరానికి రెండు వైపుల అనుసంధానం
• స్టేషన్ భవనాల అభివృద్ధి/పునరాభివృద్ధి.
• చక్కగా డిజైన్ చేయబడిన ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాల ఏర్పాటు .
• ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చక్కగా రూపొందించబడిన ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్.
• మాస్టర్ ప్లాన్‌లకు అనుగుణంగా తగిన ప్రోత్సాహ అభివృద్ధిని అందించడం.
• స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని అందించడానికి ల్యాండ్‌స్కేపింగ్, గ్రీనరీ, స్థానిక కళలు, సాoస్కృతిక చిహ్నాలు.
ఈ స్టేషన్‌లన్నింటి అభివృద్ధి ప్రస్తుతం వివిధ దశల్లో పురోగతిలో ఉంది. జంట నగరాల్లోని రెండు ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లు అంటే కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్‌ల కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనం ఫైనల్ ప్రక్రియలో ఉంది.
తెలంగాణ – అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద స్టేషన్ల జాబితా
క్రమ సంఖ్య . స్టేషన్ పేరు మొత్తం ( రూ . కోట్లు )
1 సికింద్రాబాద్ 700.00
2 హైదరాబాద్ 309.00
3 ఆదిలాబాద్ 17.80
4 భద్రాచలం రోడ్ 24.40
5 హఫీజ్పేట 26.60
6 హైటెక్ సిటీ 26.60
7 హుప్పుగూడ 26.81
8 జనగాం 24.50
9 కామారెడ్డి 39.90
10 కరీంనగర్ 26.60
11 కాజీపేట జంక్షన్ 24.45
12 ఖమ్మం 25.40
13 మధిర 25.40
14 మహబూబ్ నగర్ 39.87
15 మహబూబాబాద్ 39.72
16 మలక్ పేట 36.44
17 మల్కాజిగిరి 27.61
18 నిజామాబాద్ 53.30
19 రామగుండం 26.49
20 తాండూరు 24.40
21 యాదాద్రి 24.45
22 జహీరాబాద్ 24.35
23 బాసర్ 11.33
24 బేగంపేట 22.57
25 గద్వాల్ 9.49
26 జడ్చర్ల 10.94
27 మంచిర్యాల్ 26.49
28 మెదక్ 15.31
29 మేడ్చల్ 8.37
30 మిర్యాలగూడ 09.50
31 నల్గొండ 09.50
32 పెద్దపల్లి 26.49
33 షాద్‌నగర్ 9.59
34 ఉమ్దానగర్ 12.37
35 వికారాబాద్ 24.35
36 వరంగల్ 25.41
37 యాకుత్పురా 8.53
38 శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ 6.07
మొత్తం స్టేషన్లు: 38 స్టేషన్లు మొత్తం ఖర్చు: 1830.4 కోట్లు.