అమరావతిలో కళ్లు చెదిరేలా డ్రోన్ షో.. ఏకంగా ఐదు గిన్నీస్ రికార్డులు..

Spread the love

మంగళవారం రాత్రి విజయవాడ గగనతలం.. డ్రోన్ల వెలుగులతో నిండిపోయింది. పున్నమిఘాట్‌లో నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన.. ప్రేక్షకులను అబ్బురపరిచింది. సుమారు 5500 డ్రోన్లతో దేశంలోనే తొలిసారిగా.. ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ షోను ప్రజలంతా చూసేందుకు వీలుగా పున్నమీ ఘాట్‌లో 4 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేలను కూడా ఏర్పాటు చేశారు.

 

ప్రదర్శనలో భాగంగా.. ఆకాశంలో చిమ్మ చీకట్లో వేలాది డ్రోన్లు వివిధ ఆకారాల్లో అబ్బుర పరిచాయి. ముఖ్యంగా విమానం.. గ్లోబ్.. బుద్ధుడు.. తదితర ఆకారాలు వహ్వా అనిపించాయి. అందుకే.. రాత్రికి రాత్రే.. ఐదు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది ఈ డ్రోన్ షో. ప్రదర్శన అనంతరం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆ ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *