టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు ఇంటి వ‌ద్ద‌కే..!

Spread the love

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన కార్గో సేవలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. త‌మ ప్ర‌త్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్త‌రిస్తోంద‌న్నారు ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ఇందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

 

ఆదివారం (అక్టోబర్ 27) నుంచి హైద‌రాబాద్‌లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్‌లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు.

ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని వినియోగ‌దారుల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు. ఇంటి వద్దకే కార్గో సేవలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మరింతగా చేరువకానుంది.

 

పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలివే!

 

0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50

1.01నుంచి 5 కేజీల‌కు రూ.60

5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65

10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70

20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75

30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *