టెస్లా సీఎఫ్ఓ వైభవ్‌తో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులపై చర్చ..

Spread the love

టెస్లా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇరువురు మధ్య దాదాపు మూడు లేదా నాలుగు గంటల సేపు పెట్టుబడులపై చర్చించినట్టు సమాచారం.

 

టెస్లా పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సర్కార్ చర్చలు వేగవంతం చేస్తోంది. 2014-19 మధ్య కాలంలో టెస్లా కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆస్టిన్‌లోని టెస్లా కంపెనీ సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశమయ్యారు.

 

టెస్లా సీఎఫ్ఓ వైభవ్.. మంత్రి నారా లోకేష్ మధ్య మూడు నాలుగు గంటల సేపు పెట్టుబడులపై చర్చ జరిగింది. ఈవీ రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశమని చెప్పుకొచ్చారు మంత్రి. ఇప్పటికే ఆ ప్రాంతంలో కియో కార్ల కంపెనీ ఉందన్నారు. ఇటు బెంగుళూరు, అటు చెన్నైకి మధ్య ప్రాంతంగా ఉందని వివరించారు. అంతేకాదు కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉందన్నారు. దీనివల్ల ఎగుమతులకు దిగుమతులకు అనుకూలమైనది వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *