సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న సిఐ మహేష్ గౌడ్ మరియు పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానించిన – బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

Spread the love

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న సిఐ మహేష్ గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది అయిన సీసీటీవీ ఫుటేజ్ ఇంచార్జ్ హోంగార్డ్ వీరేశం, కానిస్టేబుల్ వెంకన్న గారికి ఘనంగా సన్మానించిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకానికి ఒక న్యాయవాదిగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బీసీవై పార్టీ ఇన్చార్జిగా, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే,ఎంపీగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, తను అనునిత్యం కమ్యూనికేషన్ జరిపే మూడు మొబైల్ ఫోన్లు కార్లో వెళుతుండగా మార్గమధ్యంలో పడిపోవడం జరిగింది, ఇట్టి విషయంలో స్థానిక పోలీస్ కార్యాలయమును ఆశ్రయించగా సదాశివపేట సిఐ మహేష్ గౌడ్ గారి సూచనల మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఇంచార్జ్ హోంగార్డ్ వీరేశం మరియు కానిస్టేబుల్ వెంకన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతి తక్కువ సమయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారికి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ తరుణంలో అతి తక్కువ సమయంలోనే అనగా ఒక రోజులో మార్గమధ్యంలో తప్పిపోయిన మూడు మొబైల్ ఫోన్లను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరియు వారి యొక్క కమ్యూనికేషన్ ద్వారా ఆచూకీ తెలుసుకొని సంబంధిత వ్యక్తుల నుండి మూడు మొబైల్ ఫోన్లను స్వీకరించి సదాశివపేట సిఐ మహేష్ గౌడ్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అందుకు సదాశివపేట పట్టణ సిఐ మహేష్ గౌడ్ గారికి, సీసీటీవీ ఫుటేజ్ ఇంచార్జ్ వీరేశం, కానిస్టేబుల్ వెంకన్న గార్లకు శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పని ఏ దైవంగా భావించి తమ యొక్క విధులను కొనసాగిస్తున్న పోలీస్ సిబ్బందికి వాళ్ల యొక్క పరిజ్ఞానానికి తగ్గ ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *