ప్ర‌భుత్వంపై భారీ కుట్ర‌లు.. కేటీఆర్ కు శిక్ష తప్పదు… పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!

Spread the love

కలెక్టర్ పై దాడిని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. పక్కా పథకం ప్రకారమే కలెక్టర్ పై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో కేటీఆర్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దాడిలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ లో కనిపిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఆరోపించారు.

 

లగచర్లలో భూమిలేని వారు కూడా కలెక్టర్ పై దాడి చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తోంద‌ని, పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారని అన్నారు. అభివృద్ధి కేంద్రీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని మండిపడ్డారు. కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించినట్టు తెలిపారు. లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆరే అని స్పష్టం చేశారు. ఈ ఫార్ములా రేస్ లో డబ్బులు చేతులు మారాయని, ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు.

 

కాంగ్రెస్ సర్కార్ ను విజ్ఞప్తి చేస్తున్నానని లగచర్ల దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్సవాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 2 లేదా 3వ‌ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధిని ఈ సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. అంతేకాకుండా ఈనెల 16 నుండి జిల్లాలలో పర్యటిస్తానని, కరీంనగర్ జిల్లా నుండి తన పర్యటన మొదలవుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *