సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో ఎం.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి.మోయిన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యొక్క ఎం.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ముఖ్య బృందం పిలుపుమేరకు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారికి ఎం.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మోయిన్ పాషా, టీ.జి.ఎఫ్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మమత, ఉప సర్పంచ్ ఎండి మగ్దుం , మాజీ సర్పంచ్ సయ్యద్ అజీమ్ ఘనంగా శాలువాలతో పూలమాలతో సన్మానించారు. ఇట్టి తరుణంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మద్దికుంట గ్రామం యొక్క భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందని అందుకు యువకులను మంచి మార్గంలో నడిపించేందుకు ఎం.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ఎండి మోయిన్ పాషా నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. అదేవిధంగా ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో విజయం సాధించిన ఎం.కె బాయ్స్ క్రికెట్ టీంకు మరియు ఫైనల్ వరకు వచ్చిన ఎం.కె వరియర్స్ క్రికెట్ టీం కు అభినందనలు తెలుపుతూ క్రీడారంగంలో గెలుపు ఓటములు సహజమని వాటి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని అందులో భాగంగా ముందు ముందు జరగబోయే క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి క్రికెట్ క్రీడారంగంలో ఎంతో నైపుణ్యం అవసరమని తెలియజేశారు. ముందు ముందు మద్దికుంట గ్రామానికి క్రికెట్ క్రీడారంగంలో మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈ సందర్భంగా ఎం.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి మోయిన్ పాషా మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించిన హర్షద్, వెంకట్ రెడ్డి, నజీర్, ముక్తార్, తోటి మిత్ర బృందానికి మరియు మద్దికుంట గ్రామ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మద్దికుంట గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.