ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సాగింది. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఏసీబీ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో కేటీఆర్ ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను ఈనెల 31 వరకు హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేయగా, కేటీఆర్ ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టును విచారణ సందర్భంగా కోరింది.