మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడిలో కీలక నిందితుడు అరెస్ట్..

Spread the love

మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడిలో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురగా కిశోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్లలో  నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కిశోర్ ను ఈ రోజు హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

 

ఇక వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తురగా కిశోర్ పలు అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కిశోర్ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *