మీకు జాబ్ కావాలా.. వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేయండి..!

Spread the love

తెలంగాణలో పెట్టుబడుల సాధనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ సర్కార్.. నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నిరుద్యోగులు ప్రవేట్ జాబ్స్ కోసం కాళ్లరిగేలా కంపెనీలు, సంస్థల చుట్టూ తిరగకుండ ప్రత్యేక యాప్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండగా, నిరుద్యోగులు యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ప్రతి ఉద్యోగ సమాచారం అందులో లభిస్తుంది.

 

DEET Telangana App ఉపయోగించే విధానం..

ఏఐ తో పని చేసేలా నిరుద్యోగుల కోసం ప్రభుత్వం DEET Telangana యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం అందులో విద్యార్హత, మీకు ఏ రంగంలో నైపుణ్యత ఉందో ఆ రంగాన్ని నమోదు చేస్తే చాలు.. మీకు రెజ్యూమ్ దానంతట అదే తయారవుతుంది. అంతేకాదు యాప్ లో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు ఇంటర్న్ షిప్ ఆప్షన్స్ ఉండడం విశేషం.

 

ఈ యాప్ లో ఆటో మొబైల్స్, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ ఇతర కంపెనీలు అందుబాటులో ఉంటాయి. మీ విద్యార్హత, మీ నైపుణ్యతను బట్టి మీకు జాబ్ కోసం యాప్, సదరు కంపెనీలకు రిఫర్ చేస్తుంది. అప్పుడు ఆ కంపెనీలు నేరుగా అభ్యర్థులను సంప్రదించి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

 

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ యాప్ ను అమల్లోకి తీసుకువచ్చింది. మరి మీరు ఎప్పటి నుండో ఉద్యోగ వేటలో ఉన్నారా.. అయితే వెంటనే DEET Telangana యాప్ డౌన్లోడ్ చేయండి.. మీ జాబ్ మీ చెంతకే వచ్చేస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *