మంద కృష్ణ మాదిగ అక్రమ కట్టడాల కూల్చివేత..

Spread the love

వరంగల్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. హన్మకొండలోని హంటర్ రోడ్డు సర్వే నెంబర్ 125కేలోని ఆయన కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది నిన్న కూల్చివేశారు.

 

హంటర్ రోడ్డులో గల తమ 400 గజాల భూమిని మంద కృష్ణతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని రెండున్నరేళ్ల క్రితం నంబూరి చారుమతి అనే మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి ఫిర్యాదు నిజమేనని తేల్చారు. ఈ మేరకు నిర్మాణాలు కూల్చివేయాలని 2022 సెప్టెంబర్‌లోనే ఆదేశాలు వచ్చాయి.

 

అయితే, అక్రమ నిర్మాణాల కూల్చివేత జాప్యం కావడంతో చారుమతి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో నిర్మాణాలను కూల్చివేయాలంటూ గడువు విధించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలంటూ మంద కృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు. దీంతో నిన్న మున్సిపల్ సిబ్బంది కట్టడాలను కూల్చివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *