కేజీహెచ్ ఆసుపత్రిలో రౌడీ షీటర్ హల్ చల్..

Spread the love

విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో రౌడీ షీటర్ హల్ చల్ చేశాడు. పిల్లల వార్డులో ఆక్సీజన్ పైపులను కట్ చేసే ప్రయత్నం చేశాడు. తనను ఉద్యోగంలో తీసేసారనే కోపంతో ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన సెక్యూరిటీ అతన్ని అడ్డుకోగా.. కత్తితో బెదిరించాడు. వెంటనే ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో.. రాజును అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ రాజుకి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *