ఆదిలాబాద్ జిల్లాలో జ్ఞానులు, ధ్యానులు, పట్టభద్రులు, సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టభద్రుల యొక్క భద్రత కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం భావితరాల భవిష్యత్తు కోసం ప్రసంగించిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తదన అనంతరం ప్రచారంలో భాగంగా అదిలాబాద్ కళాశాల ప్రాంగణంలో పట్టభద్రుల సమక్షంలో ఉమ్మడి మెదక్, నిజాంబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని అదిలాబాద్ జిల్లాలో ఉన్న పట్టబద్రులందరూ అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి సూచనల మేరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అత్యధిక మెజారిటీతో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం క్రమ సంఖ్య రెండు పై ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారు పట్టభద్రుల యొక్క సంక్షేమం కోసం, ఉపాధి కల్పన కోసం పనిచేసే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టభద్రులందరూ ప్రత్యేక చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్న పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ సాయ గౌడ్, మెదక్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొలుపుల రత్నయ్య, యువ నాయకులు జయరాజ్, అదిలాబాద్ పట్ట బదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.