నాకేం తెలియదు..! బెదిరించి ఫోటో తీసుకున్నారు..!: డిబార్ అయిన టెన్త్ స్టూడెంట్

Spread the love

నల్గొండ జిల్లా నకిరేకల్ లో పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. గోడ దూకి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసుకుని వెళ్లారు. ఆపై జవాబులను జిరాక్స్ తీయించి పరీక్ష రాస్తున్న కొందరు విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని పట్టుకున్నారు.

 

ఈ వ్యవహారంలో విద్యార్థినిని డిబార్ చేయగా.. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసరును విధుల నుంచి తప్పించారు. అయితే పేపర్ లీక్ ఘటనలో తనకు ఏ పాపం తెలియదని విద్యార్ధిని బల్లెం ఝాన్సీలక్ష్మీ వాపోతుంది. ఎగ్జామ్ సెంటర్ లో కిటికీ పక్కన కూర్చుని పరీక్ష రాస్తుండగా.. ఇద్దరు యువకులు తనను బెదిరించి ఫోటో తీసుకున్నారని చెబుతోంది. ప్రశ్నాపత్రం చూపించకపోతే రాయితో కొడతామని బెదిరించారని వెల్లడించింది. అందుకే ఆ సమయంలో భయం వేసి, ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించానని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *