ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో

Spread the love

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలు పెట్టనుంది. కాగా ఈ సినిమాకు అప్పుడే టైటిల్ కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. కొత్త సినిమాకు ఉస్తాద్ అనే పేరును పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఈ కాంబో నుంచి సినిమా ప్రకటన రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లింగువల్ చిత్రంగా దీనిని రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన రెడ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వరుస ఫ్లాపులతో సతమతవుతున్న వేళా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఊర మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. ఆ ఒక్క సినిమాతో రామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *