సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో బతుకమ్మ పండుగ సంబరాలలో పాల్గొన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది ధర్మంగాంధ రాజు అనే దంపతులకు వందమంది పుత్రులు జన్మించి వారు మరణిస్తూ ఉండడం సంభవించింది ఇట్టి తరుణంలో ఆ మహారాజు ఆదిపరాశక్తి అమ్మవారిని వేడుకుంటూ ఉంటే ఆ వందమంది పుత్ర సంతానం తర్వాత ఆడపడుచు జన్మిస్తుంది. ఈ యొక్క ఆడపడుచు సురక్షితంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆ యొక్క మహారాజు మునీశ్వరులను అందరినీ పిలిచి ఆశీర్వదించమని కోరగా మునీశ్వరులు అందరూ ఆ ఆడపడుచుని నువ్వు నిండు నూరేళ్లు బతుకమ్మ అని దీవించగా ఆ రోజు నుండి ఆమె యొక్క నామకరణ దినోత్సవంను బతుకమ్మ పండుగగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బందికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పట్టణ ప్రజలకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ కార్యాలయ సిబ్బంది , కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.