బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Spread the love

బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. 2003లో ఎంత కష్టమైనా పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీ నేతలతో ఈటల సంప్రదింపులు జరిపారన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలోనే మాట్లాడితే పోయేదని.. కానీ, సింపతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి ఆయనకు ఆయనే దూరమయ్యారని చెప్పారు. హుజూరాబాద్‌లో పార్టీల మధ్యనే పోటీ ఉందని.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అన్నారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదని కేటీఆర్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *