దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఛత్రపతి హిందీలో రీమేక్‌

Spread the love

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఛత్రపతి హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. 2005లో విడుదలైన ఈ మూవీ సంచలన విజంయ సాధించింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వివి వినాయక్‌ హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లో తెరకెక్కునున్న ఈ మూవీ రేపు ప్రారంభం కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హజరుకానుండటం విశేషం. ఇక త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. కాగా తెలుగులో మాస్‌ యాక్షన్‌గా హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ కొంతకాలంగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఛత్రపతి మూవీ రీమేక్‌తో బెల్లంకొండ బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారయ్యింది. దీంతో ఈ మూవీ కోసం శ్రీనివాస్‌ ఫిట్‌నెస్‌ దృష్టి పెట్టి మరింత ఫిట్‌గా అయ్యాడు. మాస్‌ లుక్‌తో బెల్లంకొండ మరి హిందీ ఆడియన్స్‌ మెప్పిస్తాడో లేద చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *