ఓటమి భయంతో కేసీఆర్ చెల్లింపులు, రిజిస్ట్రేషన్లు ? రేవంత్ సంచలన ఆరోపణలు..

Spread the love

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక ఎల్లుండి కౌంటింగ్ మాత్రమే మిగిలుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని తేలిపోయింది. ఇవాళ విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ విజయాన్ని నిర్ధారించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి ఖరారు కావడంతో సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతో కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇందులో బిల్లుల చెల్లింపుతో పాటు ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయని రేవంత్ తెలిపారు. వీటిపై సంబంధిత అధికారులకు, ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *