నూజివీడులో ఈ వారం శానిటేషన్ హీరో ఎవరంటే?
నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుడు శివశంకర్ ఈవారం శానిటేషన్ హీరోగా ఎంపికయ్యారు. ఈ మేరకు మీకోసం కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం నూతన వస్త్రాలను ఆయనకు బహూకరించారు. నూజివీడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బృహత్తర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. దీని కోసం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు.