స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..*
ఖమ్మం జిల్లా ప్రతినిధి జనవరి 19 (సంచలన వార్త)
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ నందు స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి సాధించి తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.. మహిళల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృతచేస్తుందని తెలిపారు.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి భద్రత సౌకర్యాలు పెరిగాయని అన్నారు..అదేవిధంగా మహిళ స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు నడుపుకునే అవకాశాన్ని కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకున్నరని తెలిపారు..ఇది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకంగా మారుతుంది అన్నారు..అనేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని,భట్టి విక్రమార్క కి అండగా ఉండాలని,ఆశీర్వదించాలని కోరారు..