కరీంనగర్ రవాణా శాఖలో అవినీతి జబ్బు చేసింది…? దానికి మందు లేదు క్యాన్సర్ కంటే తీవ్రం…?

Spread the love

” కరీంనగర్ రవాణా శాఖలో అవినీతి జబ్బు చేసింది…? దానికి మందు లేదు క్యాన్సర్ కంటే తీవ్రం…?
” ప్రజా ప్రభుత్వంలో అది కూడా రవాణా శాఖ మంత్రి ఇలాకాలో అవినీతి మచ్చ అంటు ఆరోపణలు…?
” చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా రాష్ట్రం మొత్తం రవాణా శాఖ అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతున్నా మార్పు ఎక్కడ…?
” గ్రేనెట్ లారీలు 55 టన్నులు ఉండాల్సింది ఏకంగా 100 నుంచి 110 టన్నులు ఏసుకొని వెళ్లడం యదా మామూలు అయిపోయింది…!
” లారీ డ్రైవర్ల బహిరంగ ఆరోపణలు మేము మంత్లీ కడతాము మమ్మల్ని ఎవ్వరు టచ్ కూడా చేయరు అంటు చెప్పడం గమనార్ధం…?
” వందలలో అధికాలోడ్ లారీలు కేసులు కొసరు తోనే సమాప్తం పత్రిక ప్రతినిది అడిగితే రాస్తున్నాము మేము కేసులు అంటు తుతూ మంత్రం చిట్టాలు చూపించడం గమనార్ధం…?
స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం 2 జనవరి 22 (సంచలన వార్త)
కరీంనగర్ రవాణా శాఖలో అవినీతి జబ్బు చేసింది. దానికి మందు లేదు క్యాన్సర్ కంటే తీవ్రం.
ప్రజా ప్రభుత్వంలో అది కూడా రవాణా శాఖ మంత్రి ఇలాకాలో అవినీతి మచ్చ అంటు ఆరోపణలు.
చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లుగా రాష్ట్రం మొత్తం రవాణా శాఖ అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతున్నా మార్పు ఎక్కడ. గ్రేనెట్ లారీలు 55 టన్నులు ఉండాల్సింది ఏకంగా 100 నుంచి 110 టన్నులు ఏసుకొని వెళ్లడం యదా మామూలు అయిపోయింది.
లారీ డ్రైవర్ల బహిరంగ ఆరోపణలు మేము మంత్లీ కడతాము మమ్మల్ని ఎవ్వరు టచ్ కూడా చేయరు అంటు చెప్పడం గమనార్ధం. వందలలో అధికాలోడ్ లారీలు కేసులు కొసరు తోనే సమాప్తం పత్రిక ప్రతినిది అడిగితే రాస్తున్నాము మేము కేసులు అంటు తుతూ మంత్రం చిట్టాలు చూపించడం గమనార్ధం. అసలు ఎందుకు ఇంతలా రవాణా శాఖ విచ్చలవిడిగా మారిపోతుందో అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ నగర్ నుంచి మొదలు పెడితే దారిలో వున్నా ప్రతి జిల్లాకి కాకినాడ పోర్ట్ చేరుకునే వరకు ప్రతి ఒక్క రవాణా శాఖ కార్యాలయం లో సమర్పించుకుంటు వెళ్లడం గమనార్ధం. కొన్ని కార్యాలయాలలో 5500 కొన్ని చోట్ల 4500 అంటు ఒక చోట నైతే ఒక్కో బండికి నెలకి 50000 ఇది కచ్చితంగా అచ్చర్యం కలిగిస్తున్న మొత్తం ప్రజా ప్రభుత్వం లో రాష్ట్ర రవాణా శాఖ ని దారిలో పెట్టాలి అని కొన్ని ఆంక్షలు విధించినప్పటికి అధికారుల తీరు మాత్రం మారడం లేదు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు సిగ్గుపడాల్సిన పరిస్థితి వొచ్చింది అని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమార్కుల నుంచి రాష్ట్ర రవాణా శాఖ కి జరుగుతున్నా నష్టం పట్ల జాగ్రత్త వహించాలి అని పలువురు కోరుకుంటున్నారు.
(వేచి చుడండి సంచలన వార్త ఎపిసోడ్ 3 లో రవాణా శాఖ కి పట్టిన జబ్బులు ఎవరి శాతం ఎంత వుందో వివరాలతో మీ ముందుకు)