మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డి ఎస్ రెడ్యానాయక్
డోర్నకల్ ప్రతినిది జనవరి 22 (సంచలన వార్త)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రెండో పలు వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్…
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ.. పార్టీ మారిన నాయకులను సంసారాలతో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, పోల్చడం తన విజ్ఞప్తికి వదిలేస్తున్నామని తెలిపారు.. నా రాజకీయ జీవితంలో పార్టీలోకి ఎంతో మంది వచ్చి, పార్టీ నుండి వెళ్లిన వారిని ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని గుర్తు చేశారు.. తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీ కొలువు దీరిందని చెప్పారు.. ప్రభుత్వానికి బుద్ది రావాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గోపి . మాజీ సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి. మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్. పాండు నాయక్. చిలుకూరి సర్పంచ్ రాయల వెంకటేశ్వర్లు.కాడెం బాబు. కొత్త వీరన్న. హేమచంద్రశేఖర్. యశోద. రాంబద్రం. శరత్. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ . మధు. బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు