ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
– కౌన్సిలర్ అభ్యర్థి మల్లం అనిల్
డోర్నకల్ ప్రతినిది జనవరి 30 (సంచలన వార్త)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్: పురపాలకలో ఎన్నికల హీటెక్కింది.రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దించుటకు వ్యూహ ప్రతి వ్యూహలు పన్నతున్నారు.ఈసారి ఆశవాహుల జాబితా చాలుతాడంతా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే పదవ వార్డు అభ్యర్థిగా మల్లం అనిల్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేసినా అనుభవం ఉందన్నారు.మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు అభ్యర్థి నైన తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.వార్డు నలుమూలల అభివృద్ధిని విస్తరింప చేస్తానని తెలిపారు.