భారీగా పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి నామినేషన్ దాకల్ ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.
ఖమ్మం జిల్లా ప్రతినిది జనవరి 30 (సంచలన వార్త)
శుక్రవారం. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన 7,28,29,30,31,32 వార్డుల అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి తో కలిసి వరంగల్ క్రాస్ రోడ్ రింగ్ లో వున్న ఆంజనేయ స్వామి దేవస్థానం లో పూజలు నిర్వహించి అనంతరం పెద్దఎత్తున కార్యకర్తలు అభిమానులు తో కలిసి ర్యాలీ గా వెళ్లి స్థానిక జలగం నగర్ లోని ఎంపీడీఓ ఆఫీస్ నందు తమ నామినేషన్ దాకల్ చేసారు. ఈ సందర్బంగా తుంబూరి దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజాపాలన కి పట్టం కట్టాలని కోరినారు. ఈ కార్యక్రమం ని జయప్రదం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసిన ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ.