వార్డు కౌన్సిలర్ బరిలో బీటెక్ విద్యార్థిని
డోర్నకల్ ప్రతినిది జనవరి 31 (సంచలన వార్త)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ మున్సిపల్ ఎన్నికలలో యువతులు ఆసక్తి చూపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలోని మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాబా కూతురు పదో వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీటెక్ విద్యార్థిని షేక్ తస్లీమ్ నామినేషన్ దాఖలు చేశారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్. మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోటిలింగం. మాజీ సర్పంచ్ మాదా శ్రీనివాస్. మాజీ కోఆప్షన్ వాజిద్. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు