ఎం ఎస్ ఎం ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో విధానములో అనుమతుల మంజూరు
ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఏలూరు జిల్లా ప్రతినిది పిబ్రవరి 1 (సంచలన వార్త)
చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న MSME పార్కులో పరిశ్రమ స్థాపించే వారికి ప్రభుత్వం సింగల్ విండో విధానంలో కావాల్సిన అన్ని అనుమతులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రోషన్ కుమార్ పెట్టుబడుదారులు,జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా కాలుష్య నివారణ మండలి, జిల్లా పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖ, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై MSME పార్కులోఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్షించారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం రుణ సహాయంతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని సమావేశంలోని పెట్టుబడిదారులకు వివరించారు.
పరిశ్రమంలో ఏర్పాటు పై పెట్టుబడిదారులుకున్న అనుమానాలను అధికారులతో నివృత్తి చేశారు
పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న పరిస్థితులు, రహదారులు వాతావరణ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.