తిరుపతమ్మ సమేత గోపయ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా. భక్తి జ్వాలల మధ్య తిరుపతమ్మ సమేత గోపయ్య 21వ కళ్యాణ మహోత్సవం వైభవం

Spread the love

తిరుపతమ్మ సమేత గోపయ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా.

భక్తి జ్వాలల మధ్య తిరుపతమ్మ సమేత గోపయ్య 21వ కళ్యాణ మహోత్సవం వైభవం
డోర్నకల్ ప్రతినిది ఫిబ్రవరి 01 (సంచలన వార్త)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ మండలంలోని ములకలపల్లి గ్రామంలో తిరుపతమ్మ సమేత గోపయ్య కళ్యాణ మహోత్సవం 21వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆలయ కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించారు. ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదం చేస్తాయి” అని అన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కళ్యాణ మహోత్సవం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామస్తులు, భక్తులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొనడంతో ములకలపల్లి గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. కార్యక్రమం విజయవంతం కావడంపై ఆలయ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు…. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్. మాజీ సర్పంచ్ జువాజ్ రాంప్రసాద్. గ్రామ సర్పంచ్ కళావతి జగదీష్. డాక్టర్ రమేష్. పిట్టల వెంకన్న. డీఎస్ కృష్ణ. మహేందర్. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు