15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఈ చిన్నారెడ్డి

Spread the love

15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఈ చిన్నారెడ్డి

హైదరాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 04 (సంచలన వార్త)

జిహెచ్‌ఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ రూ.15 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఈ చిన్నారెడ్డి హైదరాబాద్‌: జిహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌లో భారీ లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) పొద్దుటూరి చిన్నారెడ్డి, ఒక అధికారిక సహాయం చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.15 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన పనులను తనిఖీ చేసి, రూ.1,40,00,000/- విలువైన బిల్లులను ఆమోదం కోసం జోనల్ కమిషనర్‌కు పంపేందుకు లంచం కావాలని ఎస్‌ఈ చిన్నారెడ్డి డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ లంచం మొత్తాన్ని తన కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ బాలసాని ప్రవీణ్ కుమార్ ద్వారా స్వీకరిస్తుండగా, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచం అడిగితే ఇలా ఫిర్యాదు చేయండి
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం కోరినట్లయితే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు.
టోల్ ఫ్రీ నెంబర్: 1064
వాట్సాప్: 9440446106
ఫేస్‌బుక్: Telangana ACB
ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల మరియు బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.