సిబ్బంది సమయపాలన పాటించాలి డాక్టర్ బి రవి రాథోడ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. మహబూబాబాద్
మహబూబాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 5 (సంచలన వార్త)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్, ప్రైమరీ హెల్త్ సెంటర్ తొర్రూరు, దంతాలపల్లి పి ఎస్ సి పరిధిలోని వంతడుపుల సబ్ సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడుతూ, సిబ్బంది సమయ పాలన పాటించాలని హెచ్చరిస్తూ, సాధారణ ప్రసవాలు పెంచాలని, సిజేరియన్ ప్రసవాలను తగ్గించాలని, మాతృ మరణాలు,శిశు మరణాలు జరగకుండా చూసుకోవాలని, రేబిస్ వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచుకోవాలని, పేర్కొంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉపకేంద్రాలలో అన్నీ ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని, పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలోనే చికిత్చ తీసుకునేలా ప్రోత్సహించాలని, రక్త హీనత వున్న గర్భిణీ లను గుర్తించి ఐరన్ మాత్రలను వాడించాలని, అసంక్రమిత వ్యాధుల నివారణలో భాగం గా 30 సంవత్సరాలు పై బడిన వారందరిని రక్తపోటు,డయబెటిస్ వ్యాదుల పైన స్క్రీనింగ్ చేసి గుర్తించిన వారికి చికిత్స అందించాలని పేర్కొన్నారు.మానసిక ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఉప కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి, జిల్లా జనరల్ హాస్పిటల్ లోని సైకియాట్రిస్ట్ డాక్టర్ వద్దకు రిఫర్ చేయాలని పేర్కొన్నారు.
జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో విధిగా తెమడ పరీక్షలు నిర్వహించి, ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారణ జరిగితే పూర్తి చికిత్స ను అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నందన డాక్టర్ మానస డాక్టర్ మీరాజ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విద్యాసాగర్, డిపిఎంఓ వనాకర్ రెడ్డి, పిహెచ్‌ఎన్ సుందరి, సూపర్వైజర్స్ రమేష్, జయమని, కమల పాల్గొనడం జరిగింది.