ఓటు వినియోగించుకొనుటకు వృద్ధురాలి అవస్థ

Spread the love

ఓటు వినియోగించుకొనుటకు వృద్ధురాలి అవస్థ
డోర్నకల్: సంచలన వార్త
మహబూబాబాద్ జిల్లా
,డోర్నకల్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 5,6 వార్డుల పోలింగ్ స్టేషన్ గేటు వద్ద వృద్ధులు,వికలాంగులకు ఉపయుక్త కరంగా
అందుబాటులో ఉండవలసిన వీల్ చైర్ గేటు వద్ద లేకపోవడంతో ఓ వృద్ధురాలుని యువకుడు మోసుకొని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.ఇంతలో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఆ యువకుడ్ని ఆపి వీల్ చైర్ తెప్పించి పోలింగ్ స్టేషన్లోకి పంపించారు.ఇదిలా ఉంటే అక్కడే ఉన్న దిశ ప్రతినిధి అదృశ్యాన్ని గమనించి కెమెరాలో బంధిస్తుండగా సిబ్బంది అప్రమత్తం కావడం గమనార్హం.