‌సైనిక్ స్కూల్ ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం..

Spread the love

‌సైనిక్ స్కూల్ ఫలితాల్లో ‘ఆజాద్’ ప్రభంజనం..

యాభై మంది పరీక్ష రాస్తే 45మంది క్వాలిఫై
అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఏకైక సెంటర్
గత సంవత్సరం స్టేట్ మూడో ర్యాంక్ సొంతం
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు
కైవసం చేసుకున్న విద్యార్థులకు సన్మానం
హర్షం వ్యక్తం చేసిన ఆజాద్ యాజమాన్యం
కోచింగ్ సెంటర్లో మిన్నంటిన సంబరాలు

కూసుమంచి,ప్రతినిది ఫిబ్రవరి 28 (సంచలన వార్త) : ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫలితాల్లో కూసుమంచి కేంద్రంలో నిర్వహించబడుతున్న ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు కోచింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ అకడమిక్ డీన్ అజహరుద్దీన్ మహ్మద్ తెలిపారు. శుక్రవారం రాత్రి విడుదలైన ఫలితాలలో తమ కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ పొందిన 50మంది విద్యార్థులలో 45మంది అర్హత సాధించారని తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో మూడవర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించిన ఆజాద్ విద్యార్థులు ఆ ఆనందం మరువకముందే మళ్లీ తామేంటో నిరూపించి అత్యధికమంది క్వాలిఫై కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

మిన్నంటిన సంబరాలు..

తమ కోచింగ్ సెంటర్ నందు శిక్షణ పొందిన విద్యార్థులు 45మంది అర్హత సాధించడంతో పాఠశాల ఆవరణంలో మిఠాయిలు పంచుకుని, పటాకులు కాల్చి తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ యాజమాన్యం, ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీన్ అజహరుద్దీన్ మాట్లాడుతూ గత సంవత్సర ఫలితాల్లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో నవోదయ 30 సీట్లు, ఏకలవ్య 14 సీట్లు, రాష్ట్రస్థాయిలో స్టేట్ సైనిక్ మూడో ర్యాంకు, వందలోపు 14 ర్యాంకులు బ్యాక్ లాగ్ వేకెన్సీ లో 36 సీట్లు సాధించిన ఏకైక సంస్థగా జిల్లాలో ఆజాద్ కోచింగ్ సెంటర్ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జానిమియా మాట్లాడుతూ గత సంవత్సరం ఫలితాలతో పోలిస్తే, రానున్న ఫలితాలలో ఈ సంవత్సరం ఇంకా మెరుగైన విజయం సాధిస్తామనే విశ్వాసం వ్యక్తపరిచారు. అందుకు నిదర్శనమే ఈ ఫలితాలు అన్నారు. అంతేకాదు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన విద్యార్థి తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమని తెలిపారు. ఈ గెలుపునకు కారణమైన విద్యార్థులకు, శ్రమించిన ఉపాధ్యాయ బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం చేసి, బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో డీన్ అజహరుద్దీన్ మహమ్మద్, డైరెక్టర్లు ఆజాద్, సబిహా, సయ్యద్ మియా, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.