హైదరాబాద్ అవినీతికి గాలం…? ఏసీబీ కి చిక్కిన ఇద్దరు ఎస్ఐలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇద్దరు ఎస్ఐలు

Spread the love

” హైదరాబాద్ అవినీతికి గాలం…?
ఏసీబీ కి చిక్కిన ఇద్దరు ఎస్ఐలు
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇద్దరు ఎస్ఐలు

స్టేట్ బ్యూరో మార్చి 09 (సంచలన వార్త)

లంచం తీసుకుంటూ ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐలు బాబునాయక్, ప్రమోద్ ఓ నిందితుడికి 41 నోటీసులు ఇవ్వాల్సిన విషయమై ఫిర్యాదుదారుడి వద్ద నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశారు.

ఈ విషయంపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు ఫిర్యాదుదారు లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరు ఎస్ఐలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.