జలుబు నివారణకు ఈ ఔషధాలు వాడొద్దు: కేంద్రం

Spread the love

నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణకు ఉపయోగించే ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (FDC)తో తయారైన ఔషధాల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) నిషేధించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిష్కరిస్తే, దానిని ఎఫ్‌డీసీ ఔషధంగా పరిగణిస్తారు. ఈ ఔషధాల సహేతుకత నిర్ధారణ కాలేదని, పైగా వీటివల్ల ప్రజలకు ప్రమాదం తలెత్తవచ్చని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *