పూంచ్ లో ఉగ్ర దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

Spread the love

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు ఆర్మీ ట్రక్కులపై సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఇంటెలిజెన్సీ పక్కా సమాచారంతో డీకేజీ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *