గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శన.. గిన్నిస్ రికార్డులో చోటు..

Spread the love

గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియం అంతా కళాకారులతో నిండిపోయింది.

 

ఈ నృత్య ప్రదర్శనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వేలాది మంది ఇంత అద్భుతంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గాను గిన్నిస్ రికార్డు లభించింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ భారత్ ఆర్ట్ అకాడమీ సొంతమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *