ఢిల్లీకి సీఎం రేవంత్.. అగ్రనేతలతో భేటీ..

Spread the love

సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలో సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నామినేటేడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై హై కమాండ్‌తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అదే విధంగా మరో మూడు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన అగ్రనేతలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమచారం.

 

సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో ప్రధాని మోడీతో కూడా భేటీ కానున్నట్లు సమాచారం. గత కొన్నెేళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి విభజన అంశాలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లపై మోడీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీని కలిసేందుకు సీఎం రేవంత్‌కు అపాయిట్మెంట్ కూడా కన్ఫామ్ అయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *