టీడీపీలో అసంతృప్తి సెగలు.. కేశినేని బాటలో రాయపాటి రంగారావు

Spread the love

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుండంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. టికెట్‌ దక్కని నేతలంతా పార్టీని వీడుతూ.. తీవ్రస్థాయిలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మరొకరు ఇటీవలే విజయవాడలో ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడగా.. అవే పాలిట్రిక్స్‌ గుంటూరులోనూ సాగుతుండటంతో పొలిటికల్‌ కాక సెగలు రేపుతోంది.

 

దశాబ్ధాల కాలం నుంచి టీడీపీలో ఉన్న రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ నుంచి కూడా అసంతృప్తి జ్వాలలు ఎగిపిపడుతున్నాయి. తన కుమారుడు రంగరావు గత కొంతకాలం నుంచి చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కానీ, సత్తెనపల్లి నుంచి కానీ తనకు టికెట్ ఇవ్వాలని ఆశించారు రంగారావు. అయితే.. అధిష్టానం పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంది రాయపాటి ఫ్యామిలీ. సత్తెనపల్లి స్థానాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడంతో రంగారావు ఆగ్రహంతో ఊగిపోయారు.

 

తమను కాదని రాజకీయ విరోధి అయిన కన్నాకు ఎలా ఇస్తారని మండిపడ్డ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా తన కార్యాలయంలోని చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. తండ్రీ కొడుకులపై విమర్శలు గుప్పించారు. మంగళగిరిలో లోకేశ్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ శపథం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *