శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో సుమారు రూ.541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. మోదీ పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. అలాగే, లేపాక్షి దుర్గాతోపాటు పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించనున్నారు.