సికింద్రాబాద్ నుంచి అయోధ్య రాముడికి భారీ లడ్డూ..

Spread the love

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా అదే సంఖ్య బరువు గల లడ్డు తయారు చేయించారు. బుధవారం ఉదయం పికెట్లోని తమ నివాసం నుంచి లడ్డు శోభాయాత్రను ప్రారంభిస్తామని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *