నేడు కృష్ణా జలాల వివాదంపై కీలక భేటీ..

Spread the love

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ సమావేశం నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ ల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నీటి వాటాలు, వరద జలాల మళ్లింపు వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *