సాగు విస్తీర్ణం తగ్గడం మంచి పరిణామం కాదని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయని.. రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. రైతులను 45 రోజుల్లోనే ఎరువుల కోసం లైన్లలో నిలబెట్టారని విమర్శించారు. దావోస్‌లో సీఎం రేవంత్ అసంబద్ధ విషయాలు మాట్లాడారని దుయ్యబట్టారు.