మేడిగడ్డ బ్యారేజీలో మరిన్ని సమస్యలు..?

Spread the love

మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ అంచనాకు మించి దెబ్బతిన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు చెబుతున్నాయి. ఏడో బ్లాక్‌ తో పాటు 6, 8 బ్లాక్‌లలో కూడా మరిన్ని పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నాయి. బ్యారేజీ డిజైన్, నాణ్యత, నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. బ్యారేజీ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని, రెండు మూడేళ్ల క్రితం నుంచే సమస్య ప్రారంభమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *