మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!..

Spread the love

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ప్రపంచం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తీస్తున్నట్లు ప్రటించారు. ఫుల్ యాక్షన్ అండ్ అడ్వంచర్‌తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీంతో మహేశ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 

మహేశ్ ముఖ్యంగా ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రశాద్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలని అతడు పంచుకున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రశాద్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని తెలుపుతూ.. మరింత హైప్ పెంచేశారు.

 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్ – రాజమౌళి సినిమా ‘ఇండియానా జోన్స్’లా ఉంటుందని అన్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమా ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని తెలిపారు. అలాగే ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *