రేషన్ కార్డుల e-KYC గడువును సీఎం రేవంత్ ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా రేషన్ షాపుల వద్ద ప్రజలు పొటెత్తారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 75 శాతం మంది e-KYC పూర్తి చేసుకున్నట్లు సమాచారం.