హైదరాబాద్ నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో కల్లు దుకాణాల ఏర్పాటుకు అనుమతించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 24ను సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. సీఎస్, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.