తెలంగాణలో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములు వినియోగించకుంటే వాపస్ తీసుకోవాలని TSIIC అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. పరిశ్రమల కోసం అందుబాటులో ఉన్న భూమి, కేటాయింపులు, వినియోగంపై సమీక్షించారు. భూములు పొంది ఏళ్లుగా వినియోగించని కంపెనీల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై ప్రభుత్వం తిరిగి హక్కులు పొందేలా ప్లన్ అమలు చేయాలని సూచించారు