ఓపిక పడుతున్నాం, అదే డెడ్ లైన్ – కేటీఆర్..!

Spread the love

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు మొదలయ్యాయి. కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. వయసుకు కూడా గౌరవం లేకుండా కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు. తమకు నోరు ఉందని..ఓపిక పడుతున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మారని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని ఆరోపించారు.

 

జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర సాగించిందని చెప్పుకొచ్చారు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతుందన్నారు. చిన్న పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివ్రుద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. మార్చి 17 తరువాత పథకాల అమలు పైన తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *